ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 26 నుంచి అత్యంత వైభవంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు. ఉత్సవాల విజయవంతానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి నిర్ధేశించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్బముళ్ల భ్రమరాంబ, దేవదాయశాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, అదనపు కమిషనర్ చంద్రకుమార్, జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్, ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్లు కేవీఎస్ కోటేశ్వరరావు, లింగం రమాదేవి, సహాయ కార్యనిర్వహణాధికారి బీ.వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













