దాని కోసం మీకు ఓటు వేయాలా? : కొట్టు సత్యనారాయణ
పవన్ వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్ అని, ఆయన ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ, పిచ్చికి తక్కువ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ మానసిక స్థితి బాగాలేదని, ఏం మాట్లాడతాడో అతనికే అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని పవన్ ఎలా చెప్పారని ప్రశ్నించారు. ద్వారంపూడి సవాల్‌కు పవన్ తోక ముడిచాడని దుయ్యబట్టారు. అలాగే ప్రతీ గొడవలోనూ జనసేన కార్యకర్తలే ఉంటున్నారన్నారు. తమ కార్యకర్తలను గూండాలుగా, రౌడీలుగా తయారు చేసేలా పవన్ రెచ్చగొడుతున్నాడన్నారు. రాష్ట్రం అన్ని గుండంగా మారిందంటూ చంద్రబాబు, పవన్ ఇద్దరూ కుట్రలు చేస్తున్నారన్నారు. అధికారం రావడమే ఆలస్యం. అందరినీ లోపల వేసేస్తారట, దాని కోసం మీకు ఓటే వేయాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకి, అసలు ప్రుతుడు, దత్తప్రుతుడికి దమ్ముంటే తమ అయిదేళ్ల పాలన చూసి ఓటు వేయమని చెప్పమనండి అని అన్నారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ఏ రోజూ పవన్ కల్యాణ్ ప్రశ్నించలేదని అన్నారు.













