ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు
జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదని డిప్యూటీ సీఎం చినరాజప్ప ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలను తెలుసుకోవడం మానేసి సీఎం కావాలన్న ఏకైక లక్ష్యంతో జగన్ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఎవరూ కామెంట్ చేయలేని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. పార్లమెంట్లో అవిశ్వాసం చర్చకు వస్తుండడంతో జగన్ బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు. పార్లమెంట్లో పోరాడే అవకాశం పొగొట్టుకుని వైసీపీ వాళ్లు తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ నుంచి పారిపోయి పిల్లచేష్టలని నిరూపించుకుంటున్నారని చినరాజప్ప వ్యాఖ్యలు చేశారు.













