Elon Musk :వారు నన్ను చంపాలనుకుంటున్నారు…ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండో దఫా హయాంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఆయన నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ ( డోజ్) ప్రభుత్వ విభాగాల్లో ప్రక్షాళన కోసం కీలక విధానాలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన తీరుపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపాలని డెమోక్రట్లు (Democrats) కోరుకుంటున్నారని అన్నారు. డోజ్ (Doze) సంస్కరణలు వారికి రుచించడం లేదని ఎద్దేవా చేశారు.













