Singareni : సింగరేణి కార్మికులకు శుభవార్త : డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణి కార్మికుల (Singareni workers) కు శుభవార్త వచ్చింది. ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా రూ.1.03 లక్షల చొప్పున దీపావళి (Diwali) బోనస్ కింద రూ.400 కోట్లు విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఈ నెల 18న కార్మికుల బ్యాంకు ఖాతాలో బోనస్ సొమ్ము జమ చేయాలని సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు భట్టి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల పనితీరు ఆధారిత పురస్కారం పథకం కింద ఏటా దీపావళికి బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తం 39,500 మందికి ఈ బోనస్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి, భట్టి విక్రమార్కకు కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు.