శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడు నిర్వహించారు. మూలమూర్తిని, ఉత్సవమూర్తులను పట్టవస్త్రాలతో అలంకరించారు.