శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం జరుగుతుందని తిరుల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో నిర్వహించే అన్ని ఆస్థానాల్లోనూ ఇదే ముఖ్యమైనది అన్నారు. బంగారువాకిలి చెంత ఉందయం 7-9 గంటల మధ్య ఆస్థాన వేడుకలను నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఉత్సవర్లను సర్వభూపాల వాహనంలో వేంచేసి, మరో పీఠంపై సేనాధిపతిని ఆశీసులను చేసి ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. ఆరోజున వారపుసేవ తిరుప్పావడ, నిత్య సేవలైన కల్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేశామన్నారు. అందరి జీవితాల్లో చీకట్లను పారద్రోలి స్వామివారి కృపతో వెలుగును నిండాలని భక్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.













