DBV Swamy: ఆయనకు తిరుమల నేలపై నడిచే అర్హత లేదు : మంత్రి డీబీవీ స్వామి

తిరుమల వెంకన్నపై రాజకీయాలు మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవిష్ణువు, శనీర్వర విగ్రహానికి తేడా తెలియని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy) , నాడు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించడం దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. ఆయనకు తిరుపతి (Tirupati) నేలపై నడిచే అర్హత లేదన్నారు. చేసిన తప్పులకు వెంకన్న పాదాలు పట్టుకొని క్షమాపణలుచెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలపై వైసీపీ (YCP) నేతలు నిత్యం విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థం, తప్పుడు ప్రచారాలతో హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు. వెంకన్నతో పెట్టుకుంటే వైసీపీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.