వారి ప్రయత్నాలు కుదరకే.. నా భర్తను
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన తన భర్త దస్తగిరి బెయిల్ రాకుండా పోలీసులు, వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఆయన భార్య షబానా ఆరోపించారు. కడప జిల్లా జైలులో ఉన్న దస్తగిరిని ఆమె కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 50 రోజులుగా తన భర్త కడప జైలులోనే మగ్గుతున్నారని, అఫ్రూవర్‌గా మారిన తర్వాత ఇబ్బందులు పెరిగాయన్నారు. వివేకా కేసులో రాజీకి రావాలని వైసీపీ పెద్దలు చెప్పారు. వారి ప్రయత్నాలు కుదరకే నా భర్తను ఇబ్బంది పెడుతున్నారు. మా కుటుంబానికి ఏం జరిగినా వైసీపీ నేతలు, ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.













