Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయం లో దర్శనాలు నిలిపివేత

ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) ప్రధాన, ఉప అనుబంధ ఆలయాలను ఆ రోజు మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ముగించి ఆలయాన్ని (Temple) మూసివేయనున్నారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల ఆలయ సంప్రోక్షణ చేసి సుప్రభాతం, బిందె తీర్థం, బాలభోగం, నిజాభి సహస్రనామార్చన నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు స్వామివారి దర్శనాలను అనుమతించనున్నారు. ఆ తర్వాత తలుపులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 12, సాయంత్రం 4 గంటలకు నిర్వహిచే సత్యనారాయణ స్వామి (Satyanarayana Swamy) వ్రతాలను బ్యాచ్ రద్దు చేశారు. వాహన పూజలు మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని తెలిపారు.