చంద్రబాబు అధికారంలోకి వస్తే.. మళ్లీ అమరావతిలోనే : మంత్రి ధర్మాన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్లీ అమరావతిలోనే పెట్టుబడులు పెడతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక నటుడిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తనకు గౌరవం ఉందని అన్నారు. పవన్ సీజనల్ రాజకీయ నాయకుడని విమర్శించారు. శ్రీశ్రీ ఆశయాల కోసం పనిచేసేవారు పవన్ కల్యాణ్‌లా మాట్లాడరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాలు శ్రీశ్రీ ఆశించిన వర్గాలకు అందుతున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఆనాటి కిడ్నీ బాధితుల సమస్యలు నేడు లేవన్నారు. ఉద్దానంపై తీసుకున్న చర్యలను అభినందించలేరా? అని ప్రశ్నించారు. ప్రజా పన్నులతో అమరావతిని అభివృద్ధి చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. సైనికుల భూములను కబ్జా చేశారని తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.













