ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు : మంత్రి ధర్మాన
అసైన్డ్ భూముల అంశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయంతో ఇకపై అసైన్డ్ భూముల లబ్ధిదారులైన పేదలకు సర్వహక్కులు లభించనున్నట్లు తెలిపారు. భూమి యాజమాన్యానికి సంబంధించి మార్పులు, సంస్కరణలు, ప్రయోజనకరమైన నిర్ణయాల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. మొదట్లో వ్యవసాయం తప్ప మరొక ఉపాధిమార్గం ఉండేది కాదు. అలాంటిది, ఈ ప్రభుత్వం వచ్చాక 20 ఏళ్లుగా తమకిచ్చినటువంటి భూమిపై సాగుచేసుకుంటున్న వ్యక్తికి ఆ భూమిపై అన్ని రకాల హక్కుల్ని కల్పించింది ఈ ప్రభుత్వం. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి మహత్తర గొప్ప నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తున్నాను అని తెలిపారు.













