అది నెరవేర్చేందుకు కచ్చితంగా కృషి చేస్తా : మంత్రి ధర్మాన
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఒప్పంగి గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేను ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన ఒప్పుకోలేదు. నాకు విశాంత్రి తీసుకోవాల్సిన సమయం వచ్చిందనిపిస్తోంది. ఆగిపోతానని అన్నారు. ఈ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. అయినా అదీ ఆలోచిద్దాం. మా తర్వాత తరాన్ని తయారు చేసి అందించడం మా బాధ్యత. నా కోసం పని చేస్తున్నవారంతా ఎదగాలి. అది నెరవేర్చేందుకు కచ్చితంగా కృషి చేస్తా అని మంత్రి పేర్కొన్నారు.













