అనకాపల్లి జిల్లాలో వైసీపీకి గట్టి షాక్
అనకాపల్లి జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామ చేశారు. వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్, జైవీర్ కూడా వైసీపీకి రాజీనామ చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపారు. 2013లో దాడి వీరభద్రరావు టీడీపీకి రాజీనామా చేశారు. 2019ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. అనకాపల్లి టికెట్ ఆశించి వైసీపీలో చేరినప్పటికీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేశారు. దాడి వీరభద్రరావు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. పార్టీలో చేరికపై చర్చించేందుకు వీరభద్రరావుతో పాటు ఆయన కుమారుడు రత్నాకర్ టీడీపీ అధినేతను కలిసే అవకాశముందని సమాచారం.













