Achyutapuram : అచ్చుతాపురం టూ అమెరికా.. నెలకు రూ.20 కోట్ల మేర
అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం (Achyutapuram) కాల్సెంటర్ ద్వారా అమెరికా (America) వాసులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా (SP Tuhin Sinha) తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అత్యుతాపురం కేంద్రంగా రెండేళ్ల నుంచి కాల్ సెంటర్ (Call Center) నిర్వహిస్తూ అమెరికా వాసులను మోసం చేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందన్నారు. నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.
అచ్యుతాపురం కాల్సెంటర్లో 200 నుంచి 250 మంది వరకు పనిచేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 33 మందిని అరెస్టు చేశామన్నారు. కాల్ సెంటర్కు సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పాటు సీఐడీ అధికారుల (CID officers) తో సాయంతో కాల్ సెంటర్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోనున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడిరచారు.













