నేటి నుంచి లేపాక్షి ఉత్సవాలు
అనంతపురం జిల్లా లేపాక్షిలో ఈ నెల 31, ఏప్రిల్ ఒకటి తేదీల్లో రెండు రోజుల పాటు లేపాక్షి ఉత్పవాల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, సినీ కళాకారులు హాజరుకానున్నారు. ఉత్సవాల్లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. లేపాక్షి పెద్ద చెరువులో జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని, అనంతరం లేపాక్షి ఉత్సవాలను ప్రారంభిస్తారు. సినీ దర్శకుడు కె.విశ్వనాథ్, సీనియర్ నటులు కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, రాళ్లపల్లి, కన్నడ నటుడు శివరాజకుమార్ హాజరుకానున్నారు.













