హైకోర్టుకు హాజరైన ఏపీ సీఎస్
ఉపాధి హామీ పథకం పనుల బిల్లుల చెల్లింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. తమకు డబ్బులు చెల్లించలేదని దాఖలైన 500 పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరపు వాదనలు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వినిపించారు. హైకోర్టులో విచారణకు సీఎస్ అదిత్యనాథ్ దాస్ హాజరైనారు. నరేగా పనులపై విజిలెన్స్ విచారణ జరగడం లేదని కోర్టు సీఎస్ తెలిపారు. సీఎస్ ఆదిత్యనాథ్ స్టేట్మెంట్ హైకోర్టులో రికార్డు చేసింది. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన నరేగా పనులకు మొత్తం డబ్బులు చెల్లించామని కేంద్రం కోర్టు తెలిపింది. విచారణ జరుగుతున్నట్టు తమకు నివేదిక లేదని కేంద్రం పేర్కొంది. ఈ నెల 29కి తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. 29న తుది ఉత్తర్వులు ఉంటాయని జస్టిస్ బట్టు దేవానంద్ స్పష్టం చేశారు.













