సత్యసాయికి అరుదైన గౌరవం… పుట్టపర్తి కేంద్రంగా
భగవాన్ సత్యసాయి వల్ల పుట్టపర్తికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. తెలంగాణ విభజన తర్వాత ఏర్పడిన పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైశాల్యంలో దేశంలోనే అతిపెద్ద జిల్లాల్లో అనంతపురం ఏడవ స్థానంలో ఉంది. అనంతపురం నుంచి మడకశిరకు వెళ్లాలంటే 115 కిలోమీటర్లు మేరకు ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి అమరాపురం వెళ్లాలంటే 50 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇదే విధంగా ఎన్పీకుంటకు వెళ్లాలంటే 126 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. విశాలమైన జిల్లాను రెండుగా చేస్తే ప్రతిపాదన నేపథ్యంలో పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి ప్రాంతాలకు చెందిన వారు ఆయా ప్రాంతాల పేర్లతో జిల్లాను ఏర్పాటు చేయాలని ఉద్యమాలు నిర్వహించారు. భగవన్ సత్యసాయి పేరుతో పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని మెజార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా ఏర్పాటుకే ప్రభుత్వం మొగ్గుచూసింది.













