అమరావతిలో ఉద్యానవనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని శాఖమూరు గ్రామంవద్ద 241 ఎకరాల్లో నిర్మించే ఉద్యానవనం తుది ఆకృతులు ఖరారయ్యాయి. సీఆర్డీఏ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పార్కు ఆకృతులపై తుది నిర్ణయం తీసుకున్నారు. పార్కులో సకల విహార, వినోద సదుపాయాలు, వసతులుండేలా డిజైన్ చేశారు. 6 నెలల్లో సిద్ధం చేసి, వచ్చే సంక్రాంతికి ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి గాంధీ మెమోరియల్ అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పార్కు ప్రణాళికను అహ్మదాబాద్‌కు చెందిన హెచ్పీసీ సంస్థ రూపొందించింది.













