CRDA : సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏ సమావేశం
రాష్ట్ర రాజధాని అమరావతికి పరిశ్రమలు రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) అన్నారు. 2,500 ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ (Vijayanand), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 7 గ్రామాల్లో ల్యాండ్ ఫూలింగ్ చేస్తామన్నారు. 10 వేల మంది కూర్చునేందుకు కన్వెన్షన్ కడితే 2.5 ఎకరాలు ఇస్తామన్నారు. అంతేకాకుండా బీజేపీ కార్యాలయం (BJP office) నిర్మాణానికి 2 ఎకరాలు కేటాయిస్తామన్నామని చెప్పారు. భూములు కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపడం సహా 7 అంశాలపై సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకుందన్నారు.













