Amaravati : సచివాలయ టవర్ల నిర్మాణం … టెండర్లు పిలిచిన సీఆర్డీఏ
రాజధాని అమరావతి లో శాసనసభ (Legislative Assembly), హైకోర్టు(High Court), సచివాలయం పనులు ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సచివాలయ టవర్ల (Secretariat Towers) నిర్మాణానికి సీఆర్డీఏ (CRDA) టెండర్లు పిలిచింది. సచివాలయం లో 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లు, 3, 4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. హెచ్వోడీ కార్యాలయానికి రూ.1,126 కోట్లతో ఒక టవర్ నిర్మాణం కోసం మరో టెండరును పిలిచింది. మొత్తం 5 టవర్లకు గానూ రూ.4,668 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.













