Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఉండవల్లిలోని నివాసంలో సీఆర్డీఏ (CRDA) అథారిటీ 49వ సమావేశం జరిగింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1,052 కోట్లతో టెండర్లు పిలవడానికి ఆమోదించింది. సీడ్ యాక్సెస్ రోడ్ను నేషనల్ హైవేకు కలిపేందుకు రూ.682 కోట్లతో టెండరు పిలవాలని నిర్ణయించారు. గ్రీన్ అండ్ బ్లూ సిటీ (Green and Blue City ) నిర్మాణంపై నిపుణులతో మాట్లాడామని పట్టణాభివృద్శి శాఖమంత్రి నారాయణ (Narayana) తెలిపారు. ఉత్తర ప్రదేశ్ పర్యటనలో లక్నో లో రివర్ బండ్ ఎలా కట్టారు. అక్కడ సాలిడ్ వేస్ట్ ప్లాంట్లు ఎలా ఉన్నాయనేది అధ్యయనం చేశామన్నారు. యూపీ అధికారులు కూడా ఇక్కడకు వచ్చి సాలిడ్ వేస్ట్ ప్లాంట్లపై అధ్యయనం చేయనున్నారని వివరించారు.













