Amaravati: అమరావతిలో రూ.40 వేల కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం
దాదాపు 70 పనులకు సంబంధించి రూ.40 వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో సీఆర్డీఏ(CRDA) 45వ అథారిటీ సమావేశం జరిగింది. కాంట్రాక్టు ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మంత్రులు నారాయణ(Narayana), పయ్యావుల కేశవ్(Payyavula Keshav) , సీఎస్ విజయానంద్ (CS Vijayanand) , ఉన్నతాధికారులు హాజరయ్యారు.













