ఢిల్లీ ఉద్యమం జయప్రదం అయితే…మన ఉద్యమం జయప్రదం
అమరావతి ఉద్యమానికి మంచి రోజులు వస్తాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ఉద్యమం జయప్రదం అయితే మనం కూడా జయప్రదం అవుతాయమని తెలిపారు. అమరావతి అందరికి సమానదూరంలో ఉందన్నారు. జేఏసీ ఎవరినో ఒకరినో భుజనా వేసుకుంటే అమరావతి ఉమ్యమానికి ముక్తి ఉండదన్నారు. ఉద్యమం విజయంతం కావాలంటే 10 మందితో కలిసి పని చేయాలని సూచించారు. ఉమ్మడి ఆశయం, లక్ష్యం మార్గం మంచిదై ఉండాలన్నారు. ఇది భవిష్యత్‌లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాబోతోందని సృష్టం చేశారు. మూడు రాజధానిల పేరుతో రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేయవద్దు అని.. రాజధాని మార్చడం అనేది ప్రజలు అంగీకరించరని మధు తేల్చి చెప్పారు.













