తిరుపతి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఖరారు
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల బరిలోకి సీపీఎం దిగింది. ఆ పార్టీ తరపున నెల్లూరు యాదగిరి పోటీ చేయనున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు ప్రకటించారు. యాదగిరి అభ్యర్థిత్వాన్ని బలపర్చవలసిందిగా సిపిఐ, ఇతర వామపక్షాలను కోరామని, వారు సానుకులంగా స్పందించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సి సామాజిక తరగతికి చెందిన యాదగిరి నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. సీపీఎం కాగితాలపూరు గ్రామ కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనేక ప్రజాసంఘాల్లో బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు.













