టీడీపీకి సీపీఐ మద్దతు.. నారా లోకేష్‌కు రామకృష్ణ ఫోన్
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ శ్రేణులు ఈ అరెస్టుపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు పట్ల సీబీఐ తీరు చాలా దుర్మార్గమని, ఈ కష్టకాలంలో ధైర్యం కోల్పోకూడదని చెప్పారు. ఈ విషయంలో సీపీఐ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలపై పోలీసులు వైఖరిపై మంగళవారం నాడు విజయవాడలో అఖిలపక్షాలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.













