తప్పులను ఎత్తిచూపిన వారిపై… ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిన వారిపై బెదిరింపులు, అక్రమ అరెస్టులకు పాల్పడటం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇలాంటి ఘటనలు విఘాతం కల్గిస్తున్నాయన్నారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు అక్రమ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. ఎంపీని అరెస్టు చేసి తన పాలనను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదని సంకేతాలిచ్చారని విమర్శించారు. దేశమంతా కరోనాతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.