ఆయనది తుగ్లక్ పాలన కాదు.. జగ్లక్ పాలన
రాజధాని అంశంపై గత 38 రోజులుగా ఆందోళనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం మాట్లాడుతన్నారో అర్థం కావటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికైన ప్రభుత్వం ఏదైనా చేయవచ్చని సీఎం అంటున్నారు. వైకాపా ఎన్నికల ప్రణాళికలో అమరావతి నుంచి రాజధాని మార్చమని చెప్పారు. మీ పంతం నెగ్గించుకోవటంకోసం ఎంతకైనా వెళ్తారా? వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపిస్తే.. మండలి రద్దు చేస్తారా? శానసమండలికి రూ.5 కోట్లు ఖర్చు చేసేందుకు భారమంటున్నారు. రాజధాని కేసులు వాదించే న్యాయవాదులకు రూ.5 కోట్లు ఎలా చెల్లిస్తారు? జగన్‌ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అని రామకృష్ణ విమర్శించారు.













