175 కాదు 17 సీట్లు కూడా రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ఎన్నికల్లో 17 సీట్లు కూడా రావని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 175 సీట్లు గెలువడానికి అసలు ఏ వర్గానికి మేలు చేశారో ముఖ్యమంత్రి జగన్ సమధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు అధికారాలు లేకపోగా, వాళ్లను జగన్ కీలు బొమ్మల్లా మార్చాడాని ఆరోపించారు. 85 శాతం కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందితే ఎమ్మెల్యేలను మారుస్తానని జగన్ ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రజా పోరాటాల్లో కలిసి వచ్చే వారితోనే ముందుకెళ్తామని తెలిపారు.













