ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం : రామకృష్ణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం బాలేదంటే ఎగతాళిగా మాట్లాడతారా? అని మండిపడ్డారు. ఆరోగ్యంపై వైద్యులు చెప్పాలి గానీ, డీజీపీ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కృష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సదస్సు పెడుతున్నారు. ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్ పున పంపిణి నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం జగన్ ఢల్లీిలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండి మరి దీనిని అడ్డుకోవడంలో జగన్ విఫలమయ్యారు. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు అని విమర్శించారు.













