కేంద్రాన్ని అడగలేక ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతూ ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, మోసం చేసిన అధ్యాయమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలపై విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ దగ్గర కనీస ప్రస్తావన కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఇప్పటికైనా దీనిపై ఆఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.













