స్వప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రయోజనాలు గాలికొదిలేశారు
స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాల వ్యవహారంలో పున పంపిణీ నిర్ణయం కచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం చేయడానికేనని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్ ఉత్తర రాసి ఊరుకున్నారే తప్ప దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తూ దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా చూస్తూ ఉండిపోయారని అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని ద్వజమెత్తారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తక్షణమే స్పందించి అన్ని సంఘాలు, పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.













