ప్రతిపక్ష నాయకులకు ఆ ప్రాంతంలో.. పర్యటించే హక్కు లేదా?
పుంగనూరు నిషేధిత ప్రాంతమా? ప్రతిపక్ష నాయకులకు ఆ ప్రాంతంలో పర్యటించే హక్కు లేదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పుంగనూరులో జరిగిన ఘటనల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో ఇద్దరు మాజీ మంత్రులపై అక్రమంగా పెట్టిన హత్యాయత్నం కేసులను బేషరతుగా ఉపసంహరించాలి. లేని పక్షంలో ప్రజాస్వామ్య మనుగడ కోసం ప్రజాతంత్రవాదులతో కలిసి ఉద్యమిస్తాం. రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ కలిసి ఆడుతున్న డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టాలి అని స్పష్టం చేశారు.













