న్యాయవ్యవస్థపై గౌరవం ఉంటే.. మంత్రి
పోలవరం ప్రాజెక్ట్ను 135 అడుగులకే ఉంచడం కరెక్ట్ కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్ట్ 150 అడుగులకు పైగా ఎత్తు ఉంటేనే నీరు అందుతుందని తెలిపారు. కేంద్రం ఒత్తిళ్లుకు వైసీపీ ప్రభుత్వం లొంగిపోయిందన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. కోర్టులో చోరీకి బాధ్యుడైన మంత్రి తొలగించాని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థపై గౌరవం ఉంటే మంత్రి చర్య తీసుకోవాలన్నారు. కోర్టులో దొంగతనంపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జీతం తీసుకుంటుంది శాంతిభద్రతలు కాపాడటానికా, లేక అధికార పార్టీ నేతలకు ఊడిగం చేయడానికా? అని ప్రశ్నించారు.













