సీఎం తప్పు చేస్తే.. డీజీపీపై వేటు పడింది
ఆంధ్రప్రదేశ్ మ్యుమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పు చేస్తే డీజీపీపై వేటు పడిందని సీపీఐ రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ ఉద్యమంతోనే డీజీపీపై వేటు వేశారని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మరోసారి సీఎం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. జేసీ చైర్మన్లకు సీఎం జగన్ చెడ్డపేరు తెచ్చారన్నారు. బీజేపీ నేత జీవీఎల్‌కు పోయే కాలం వచ్చిందని అన్నారు. ప్రత్యేక హోదా కాలం చెల్లిందని జీవీఎల్ వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రత్యేక హోదాపై మలిదశ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ నెల 20న ఎంపీలు, రాజకీయ పార్టీలు, యువజన సంఘాలతో భేటీ అవనున్నట్లు తెలిపారు.













