అది వ్యక్తిగత భేటీనా? లేక వ్యవస్థీకృత భేటీనా : రామకృష్ణ
అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీతో జరిగిన భేటీ వివరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడిరచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అది వ్యక్తిగత భేటీనా? లేక వ్యవస్థీకృత భేటీనా? అని ప్రశ్నించారు. గతంలో కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చే పేరుతో అదానీ జగన్తో 4 గంటలపాటు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే గంగవరం, కృష్ణ పోట్నం పోర్టులను, సోలార్ విద్యుత్ ఒప్పందాలను అదానీ కంపెనీకే అప్పగించారు. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు కూడా అత్యంత భారీ ధరకు అదానీకే కట్టబెట్టారు. జగన్, అదానీల రహస్య భేటీ వెనుక మర్మమేంటి? అని ప్రశ్నించారు.













