గతంలో అందరూ అంగీకరించారు.. కానీ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో బస్సు యాత్ర కొనసాగుతోంది. తుళ్లూరుకు చేరుకున్న సీపీఐ నేతలకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. తుళ్లూరులోని దీక్షా శిబిరం నుంచి రైతులతో రామకృష్ణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండాలని గతంలో అందరూ అంగీకరించారు. మాట మార్చిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. కులం పేరుతో దుష్ప్రచారాలు చేస్తారా? సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? జగన్ కంటే పెత్తందారు ఎవరైనా ఉన్నారా? ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి. వైసీపీ పాలనలో అన్ని రంగాలు నష్టపోయాయి అని విమర్శించారు.













