ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసిన జగన్… సీఎం అయ్యాక
మిగ్జాం తుపాను బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తుఫాను బాధితులను ఆదుకోవాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు, ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయవిపత్తుగా ప్రకటించి బాధితులకు సహయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసిన జగన్, సీఎం అయ్యాక జనాల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.













