వైసీపీకి దమ్ముంటే క్యాబినెట్ రాజీనామా చేసిన.. ఎన్నికలకు
వైసీపీకి దమ్ముంటే క్యాబినెట్ మొత్తం రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎక్కడ లేని రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. గౌతం రెడ్డి అకాల మరణం కారణంగా ఖాళీ అయిన ఆత్మకూరులో టీడీపీ పోటీ చేయడం లేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారని పేర్కొన్నారు. 151 సీట్లు ఇచ్చేంత గొప్ప పని జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. 23 సీట్లు ఇచ్చేంత చెడ్డ పని చంద్రబాబు ఏం చేశారో ప్రజలు ఈ విషయం ఆలోచించుకోవాలన్నారు.
తెలంగాణలో భూములు ధరలు అమాంతం పెరిగాయన్నారు. ఆంధ్రా ప్రజల్ని ఏడిపించి జగన్ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. పేకాటలో మూడు ముక్కలాట జగన్‌లో జీర్ణించుకుపోయిందన్నారు. అందుకే మూడు రాజధానులని అంటున్నారన్నారు. తనను జైలు పంపించవద్దని జగన్ ప్రధాని కాళ్లు పట్టుకున్నాడన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా కేంద్ర హోమంత్రిని కలుస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేశారన్నారు. ప్రత్యేక హోదా, ఉక్కు కర్మాగారం నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మంచి సమయమన్నారు. ఇది జగన్‌ను ప్రజలే అండమాన్ జైలుకు పంపించే రోజులు దగ్గరేలోనే ఉన్నాయని అన్నారు.













