తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా : నారాయణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేల అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఏమీ జరగదని వైసీపీ అధిష్ఠానాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ప్రభుత్వం మార్పు తప్పదు. జగన్ పాలనలో అహంకారం, నియంతృత్వం పెరిగిపోయింది. ఆయన హెలికాప్టర్లో తిరిగితే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి. సీఎం పర్యటన కోసం మనుషులను నిర్బంధించడం దారుణం అని విమర్శించారు.













