ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కొత్త కూటమి : నారాయణ
పొత్తుల విషయంలో టీడీపీ ఊగిసలాట వీడాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ సూచించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, బీజేపీ కలిసే ఉన్నాయని, ఇప్పటికైనా టీడీపీ మేల్కొని ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేయాలన్నారు. టీడీపీ పాలకమండలిలో మద్యం వ్యాపారులకు చోటివ్వడం సరికాదని తెలిపారు. వైసీపీ, బీజేపీ లివింగ్ టుగెదర్ వాళ్లేమీ విడిపోరు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎంత కొట్లాడినా వైసీపీని ఓడిరచే పరిస్థితికి పోదు. రాష్ట్రానికి అన్నివిధాలుగా నష్టం చేసిన బీజేపీకి టీడీపీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందించడం మంచిది కాదన్నారు. సీపీఐ, సీపీఎం, జనసేనతో టీడీపీ ఓ ఫ్రంట్ ఏర్పాటు చేయగలిగితే వైసీపీ, బీజేపీ డబుల్ ఇంజిన్ ఫెయిల్ అవుతుంది. అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అని అన్నారు.













