కేంద్రం ఏం చేప్తే.. వైసీపీ అదే చేస్తోంది
కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే వైసీపీ అదే చేస్తోందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి వైసీపీ ఎందుకు సహకరిస్తుందో అర్థం కావట్లేదని అన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలనే కేంద్ర నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోందని ప్రశ్నించారు. విశాఖలో వైసీపీ ఎంపీ భూములు ఎలా ఆక్రమించుకుంటున్నారో విజయాసాయిరెడ్డి చెబుతున్నారన్నారు. విజయసాయి ఆక్రమాలను స్వయంగా వైసీపీ నేతలే వివరిస్తున్నారని తెలిపారు. వైసీపీ నేతల భూ కబ్జాలపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.













