ఈ రెండింటి మధ్య పోలికలు… నక్కకు నాగలోకానికి ఉన్నంత
ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి, అప్రకటిత విద్యుత్ కోతలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈ క్రమంలో ఆయన ఆంధ్ర-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. ఏపీ రోడ్ల దుస్థితి, తమిళనాడు రోడ్ల గురించి వీడియోల్లో ఆధారాలతో సహా వివరించారు. కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రులు తప్పుబడుతున్న నేపథ్యంలో తాను ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని, పక్క రాష్ట్ర రహదారులు చక్కగా ఉన్నాయని తెలిపారు. ఈ రెండిరటి మధ్య పోలికలు చూస్తుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. నగరి మండంలో తన స్వగ్రామమైన ఆయనంబాకం గ్రామానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని తెలిపారు.













