వివేకాను చంపిందెవరో అందరికి తెలిసిపోయింది : నారాయణ
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకాను చంపిందెవరో అందరికి తెలిసిపోయిందన్నారు. ఆ హత్యకు వైఎస్ కుటుంబీకులే నైతిక బాధ్యత వహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరగొచ్చని అన్నారు. సీబీఐపైనే ఎదురుదాడి చేసే వ్యవస్థ రాష్ట్రంలో ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో సినిమాలు కూడా భయంభయంగా చూడాల్సి వస్తోందన్నారు. సాంస్కృతిక రంగంలో వివాదానికి జగన్ వైఖరే కారణం అన్నారు. చిరంజీవి స్వార్థం కోసమే సీఎం వైఎస్ జగన్ కలిసి సినిమా రాయితీలు మాట్లాడుకున్నారని ఆరోపించారు. బిగ్బాస్కు వ్యతిరేకంగా డిజిటల్ ప్రచారం చేస్తున్నామని తెలిపారు. బిగ్బాస్ హౌస్ బ్రోతల్ హౌస్గా మారిందని మరోసారి వ్యాఖ్యానించారు. లైసెన్స్ పొందిన వ్యభిచార గృహం నిర్వహించడానికి షో నిర్వహిస్తున్నారంటూ విమర్శించారు.













