ప్రభుత్వం ఏం చెబితే అది రాస్తుంది : నారాయణ

రుయా ఆస్పత్రిలో మృతుల సంఖ్యపై ప్రభుత్వం వాస్తవాలు చెప్పట్లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మందే చనిపోయారని ప్రభుత్వం అసత్యం చెబుతోందన్నారు. ఆస్పత్రిలో మొత్తం 23 మంది చనిపోయారంటూ వారి పేర్లతో సహా వివరాలు తెలిపారు. ఆక్సిజన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతుందని ప్రశ్నించారు. ఆక్సిజన్ ట్యాంకర్లు రెండ్రోజుల ముందు తెప్పించుకొని నిల్వ పెట్టుకోరా? అని ప్రశ్నించారు. ఆక్సిజన్ ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. వ్యాక్సిన్ కంపెనీలకు కులాలు అపాదిస్తారా? విచారణ కమిటీ వ్యర్థం.. ప్రభుత్వం ఏం చెబితే అది రాస్తుందని అన్నారు. వైకాపా నేతలు కల్యాణ మండలపాలు కొవిడ్ కేంద్రాలుగా మార్చుకోవాలన్నారు. కేంద్రంపై పోరాడలేక ప్రతిపక్ష నేత, వైద్యులపై అఖాండాలు వేస్తారా? అని మండిపడ్డారు.