ప్రభుత్వానికి అండగా నిలిచిన .. తగిన శాస్తే జరిగింది
ఎన్ని విమర్శలు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచిన గౌతమ్ సవాంగ్ లాంటి వారికే చివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా అవమానపరిచారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. నిబంధనలు మరిచి పాలకపక్షం అడుగులకు మడుగులొత్తే అధికారులకు గౌతమ్ సవాంగ్ వ్యవహారంతో కనువిప్పు కలగాలని అన్నారు. ఒక రకంగా గౌతమ్ సవాంగ్‌కు తగిన శాస్త్రి జరిగిందని అన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేశ్‌ల విషయంలో అలాగే జరిగిందన్నారు. తమ బాధ్యతలను అధికారులు నెరవేర్చాలని లేదంటే తమ వల్ల కాదంటూ దండం పెట్టి ఆ విభాగం నుంచి మారిపోవాలని సూచించారు.













