షా అనుమతితోనే జగన్ ఈ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్కు బలం ఉందని మండలిని రద్దు చేయడం సరికాదని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లు చెల్లలేదు కాబట్టి మండలినే రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. మండలిని రద్దు చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో చెప్పలేదన్నారు. కేంద్రమంత్రి అమిత్ షా అనుమతితోనే, సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నామన్నారు. సీఎం జగన్ తన మార్కు ఉండదనే అమరావతిని తొలగిస్తున్నారని విమర్శించారు. జగన్కు ఆత్రం ఆగటం లేదన్నారు. వైఎస్ చనిపోయినప్పుడు తండ్రి శవం ఇంకా ఇంటికి చేరకముందే.. జగన్ సంతకాలతో సీఎం పదవి కోసం తొందరపడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 4 నెలలు ఆగితే మండలిలో వైసీపీ బలం పెరిగేదని నారాయణ వ్యాఖ్యానించారు.













