Narayana: వైసీపీ రాజ్యసభలో ఒకలా.. లోక్సభలో మరోలా : నారాయణ
వక్ఫ్ బిల్లుపై వైసీపీ దొంగాట ఆడిరదని సీపీఐ నేత నారాయణ (Narayana) విమర్శించారు. తిరుపతి (Tirupati) లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రాజ్యసభ (Rajya Sabha) లో ఒకలా, లోక్సభ (Lok Sabha) లో మరోలా మద్దతిచ్చిందని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 12న నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీసుల మనోధైర్యం దెబ్బతీసేలా జగన్ మాట్లాడకూడదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తప్పు అని పేర్కొన్నారు. ట్రేడ్ వార్ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. చింతపల్లె అటవీ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వెళ్లడం, రాత్రి బస చేసిన విధానం బాగుంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే బీజేపీ భాష, డీలిమిటేషన్ , వక్ఫ్ బోర్డు అంశాలను ముందుకు తీసుకుని పోతోంది. వక్ఫ్ బోర్డు ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలనేది ఆ పార్టీ కుట్ర అని విమర్శించారు.













