జనం మద్దతు ఉంటే.. పోలీసుల వలయం ఎందుకు?
జనం మద్దతు ఉంటే పోలీసుల వలయంలో ఎందుకు తిరుగుతున్నావ్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది జగన్ ప్రభుత్వం కూలబోతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. కుటుంబ సభ్యులతో కూడా స్వేచ్ఛగా తిరుగలేని జగన్, ప్రతిపక్ష పార్టీలకు మాత్రం సవాల్ విసురుతున్నాడు అన్నారు. విశాఖపట్నం సీల్ట్ ఫ్లాంట్‌ను బీజేపీ డంపింగ్ యార్డ్ గా మార్చబోతోందన్నారు. ఇలా జరిగే చూస్తు ఊరుకోం అన్నారు. మోదీ హటావో దేశ్ బచావో నినాదంతో త్వరలో సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని వెల్లడించారు. మోదీ జగన్‌ది నియంత పాలన అని మండిపడ్డారు. వీరిద్దరి వలన రాష్ట్ర నాశనం అవుతోందన్నారు. విశాఖ పట్నం సమ్మిట్‌లో 13 లక్షల కోట్లు వచ్చాయాంటె హాస్యాస్పదంగా ఉంది. అవన్నీ కాకి లెక్కలన్నారు. మూడు రాజధానులు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై పారిశ్రామిక వేత్తలకు నమ్మకం పోయిందని అన్నారు.













