ఆయన విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటే.. జగన్ కు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద పసలేకే పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ప్రమాదామా? ఇంట్లో బాబాయిని చంపితే ప్రమాదమా? అని పరోక్షంగా వివేకా హత్యను ప్రస్తావించారు. బాబాయిని చంపడం తప్పుకాదని చెబుతారా? అని నిలదీశారు. ఆయన విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటే జగన్‌కు ఎందుకని ప్రశ్నించారు. సీఎం జగన్ తన స్థాయిని మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాజకీయ పరమైన అంశాలతో ఎవరినైనా విమర్శించొచ్చు కానీ, తరచూ వ్యక్తిగత దూషణలతో నిందలు వేయడం ఏంటని మండిపడ్డారు. రాజకీయంగా పస లేనందువల్లే జగన్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు.













